వినోదం
ఓయ్-కొరివి జయకుమార్
యాంకర్ విష్ణు ప్రియ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. గతంలో అందాలను ఆరబోసి గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట హీట్ పెంచింది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సబ్‌స్క్రిప్షన్స్’ ప్రారంభించింది. అయితే ఈ వ్యవహారంలో విష్ణు ప్రియకు పెద్ద షాక్ తగిలిన సంగతి తెలిసిందే.
మరోవైపు విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం యువతను తప్పుదోవ పట్టించేందుకే అర్ధనగ్న వీడియోలను పోస్ట్ చేస్తోందని, తక్షణమే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రముఖులు ఇలా అసభ్యకర ప్రచారాలు చేయడం తగదని విమర్శించారు.

కానీ నేటి కాలంలో నెగెటివ్ ప్రచారం కూడా డబ్బు తెచ్చిపెడుతుందని విష్ణుప్రియ ఇష్యూ నిజం చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నారని విజయవాడలోని ఏఐఎస్‌ఎఫ్ నేతలు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. అయితే ఈ విషయం పరోక్షంగా ఆమెకు బాగా కలిసొచ్చిందని అంటున్నారు. AISF నాయకులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు చందాదారుల సంఖ్య పరిమితం చేయబడింది. అప్పుడు చందాదారుల సంఖ్య 1,892.. ఈ లెక్కన ఆమె నెలవారీ ఆదాయం దాదాపు రూ.7,18,960.
ఈ వివాదం తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 4,832కి చేరుకుంది. దీంతో ఆమె ప్రస్తుత ఆదాయం అక్షరాలా రూ.18,36,160కి చేరింది. కేవలం ఒక వివాదం కారణంగా ఆమె నెలవారీ సంపాదన ₹11 లక్షలకు పైగా పెరిగిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద.. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే.. ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
విష్ణు ప్రియా ప్రత్యేకమైన 🥶 వద్ద మరో బ్యాంగర్ను వదులుకుంది
ఒక థ్రెడ్ 🧵 pic.twitter.com/o8SuD6jI0Z
— కార్తీ (@its_Karthi26) ఏప్రిల్ 6, 2026
