తెలంగాణలో పునర్విభజనతో కొత్త సీట్లు.. రిజర్వేషన్లు ఇవే – ఈ సీట్ల కుదింపు..!! | తెలంగాణలో పార్లమెంటు స్థానాలను 17 నుంచి 26కి విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ ప్రతిపాదనలు, ఇక్కడ వివరాలు

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీలిమిటేషన్ అమలుకు కేంద్రం సిద్ధమైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజనకు కేంద్రం ఇప్పటికే సిద్ధమైంది. దీంతో.. కొత్త ఎంపీ సీట్లు.. రిజర్వేషన్లపై దాదాపు క్లారిటీ వచ్చేసింది.

2029 ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త నియోజకవర్గాల్లో 2029లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, మహిళా బిల్లుకు మద్దతిస్తున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ తో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాలు 26కు పెరగనున్నాయి.అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పెంపుదల కొత్త నియోజకవర్గాలపై స్పష్టత వచ్చింది. ఈ లెక్కన రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 52,96,741 జనాభాతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం, ఇది మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి మరియు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ పరిధులన్నీ పూర్తిగా మారనున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, భువనగిరి నియోజకవర్గాల్లో అధిక జనాభా ఉంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని నాలుగు కొత్త లోక్‌సభ స్థానాలుగా విభజించి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం మల్కాజ్ గిరి కావడంతో రెండు స్థానాలుగా విభజించనున్నారు.

తెలంగాణాలో 17 నుంచి 26 వరకు పార్లమెంట్ సీట్ల విస్తరణకు యూనియన్-ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రతిపాదనలు

డీలిమిటేషన్‌తో రాజకీయ ముఖచిత్రం మారనుంది

ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను విడదీసి రెండు కొత్త స్థానాలు ఏర్పాటవుతాయి. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో సీటును ఏర్పాటు చేయనున్నారు. ఇక మహబూబ్ నగర్ – నాగర్ కర్నూల్ ను విభజించి మరో సీటు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల్లో మరో రెండు సీట్లు రానున్నాయి. ఇక.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో.. 2029 ఎన్నికల నుంచి రాష్ట్రంలో మహిళలకు 9 సీట్లు కేటాయించనున్నారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 55 సీట్లు ఇవ్వాలి. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేయనుంది. అభిప్రాయ సేకరణ అనంతరం.. కేంద్రానికి నివేదిక.. ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ కొత్త నియోజకవర్గాలపై అధికారిక గెజిట్‌ విడుదల చేయనున్నారు. దీంతో ఈ డీలిమిటేషన్ పై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

More posts