పోలవరం: పోలవరానికి మహర్దశ – చంద్రబాబు ప్లాన్ అదుర్స్..!! | సిఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు మరియు నీటిపారుదల ప్రాజెక్టులకు డెడ్‌లైన్‌లు నిర్దేశించారు, పోలవరాన్ని టూరిజం హబ్‌గా ముందుకు తెస్తున్నారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. బుధవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వెలిగొండ స్టేజ్-1 పనులను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు.

పోలవరం.. పర్యాటకుల స్వర్గధామం

పోలవరం ఈ ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రాజెక్టు పరిసరాల్లో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, షాపింగ్ ఏరియాలు, సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పోలవరం నుంచి పాపికొండలు, భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించాలని, క్రీడా అంశాలు, అటవీ ఆకర్షణలతో పర్యాటకులను ఆకట్టుకోవాలన్నారు.

cm-chandrababu-naidu-reviews-and-set-dedelines-for-ඉరిగేషన్-ప్రాజెక్ట్స్-Pushes-polavaram-as-tourism

నదుల అనుసంధానం – ఉత్తర ఆంధ్ర ప్రాజెక్టులు

ఉత్తరాంధ్ర ప్రాధాన్యతను వివరిస్తూ ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార-నాగావళి నదుల అనుసంధానం, జూలై నాటికి నాగావళి-చంపావతి అనుసంధానం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి డెడ్‌లైన్ విధించారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేరడి బ్యారేజీ పనులకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజీ తదితర ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

పెరిగిన భూగర్భ జలాలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల భూగర్భ జలాల లభ్యత గణనీయంగా పెరిగిందని సీఎం అన్నారు చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశాడు. గతేడాదితో పోలిస్తే 12 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగి ప్రస్తుతం 625 టీఎంసీలకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.79 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. దాదాపు 5,697 గ్రామాల్లో కేవలం 8 మీటర్ల లోతులోనే నీరు అందుబాటులో ఉండడం శుభ పరిణామం.

రాయలసీమకు ఉపశమనం
ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మాల్యా లిఫ్ట్ ద్వారా 52 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా హంద్రీ-నీవా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికపూడిశెల తదితర ప్రాజెక్టుల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు.

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, నీటి వనరుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇటు పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అటు వెలిగొండ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ జలవనరుల రంగంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు ఈ సభ ద్వారా స్పష్టమవుతోంది.

More posts