క్రీడలు
oi-ఉప్పల శివప్రసాద్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ భారీ విజయాన్ని అందుకుంది. శనివారం జైపూర్ వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ రాణించారు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తన స్పిన్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్లే-ఆఫ్స్ బెర్త్ నుండి ఒక అడుగు దూరంలో. మరోవైపు రాజస్థాన్ ఐదో స్థానానికి దిగజారడంతో ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.

రెచ్చిపోయిన రషీద్ ఖాన్..
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రవీంద్ర జడేజా (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) మినహా అందరూ విఫలమయ్యారు. రషీద్ ఖాన్ (4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ను శాసించాడు. జాసన్ హోల్డర్ (3/12) మూడు వికెట్లు తీశాడు. కగిసో రబడ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55), శుభమన్ గిల్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84) అర్ధ సెంచరీలతో రాణించారు. వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు తీశాడు. యష్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.
సిరాజ్ వెనుదిరిగాడు..
బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచినా.. రషీద్ ఖాన్ బౌలింగ్ లో నాలుగు వికెట్లతో చెలరేగినా.. మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ కు విజయాన్ని అందించాడు. ప్రమాదకరమైన ఓపెనర్, సిక్సరా పిడుగు పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి మ్యాచ్‌ని గుజరాత్ టైటాన్స్ వైపు మళ్లించాడు. సిరాజ్‌ను వైభవ్ సూర్యవంశీ ఔట్ చేయకుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కనీసం పవర్ ప్లే ముగిసే వరకు వైభవ్ క్రీజులో ఉండి మ్యాచ్ చేజిక్కించుకునేవాడు. ఈ విజయం ఘనత సిరాజ్దేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
