ఆరోగ్యం
-సాయి చైతన్య
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడిమికి శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇలాంటి వాతావరణంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. శరీర భాగాలు కాలిపోవడం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో జేబులో ఉల్లిపాయ పెట్టుకో.. వడదెబ్బ తగులుతుంది’ అంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన సలహా తాజాగా చర్చనీయాంశంగా మారింది. మీరు నిజంగా మీ జేబులో ఉల్లిపాయను పెట్టుకుని ఎండలో బయటికి వెళితే, మీరు హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించగలరా?
ఉల్లి చేయగలిగింది, ఏ తల్లి చేయదు అనే సామెత ఉంది. ఉల్లిపాయ రసం సహజంగా శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే వేసవిలో ఉల్లిపాయలు తింటే శరీరం చల్లగా ఉంటుంది. అయితే వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఉల్లిపాయలను జేబులో పెట్టుకుని బయటకు వెళ్లడం లాభదాయకమని చెబుతున్నారు. మీ జేబులో ఉల్లిపాయను ఉంచుకోవడం వడదెబ్బ నుండి మిమ్మల్ని రక్షించగలదని శాస్త్రీయ ఆధారాలు లేవు. ఉల్లిపాయలో సహజసిద్ధమైన గుణాలున్న మాట వాస్తవమే. ముఖ్యంగా ఉల్లిపాయ తినడం వల్ల శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కొంతవరకు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు మినరల్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడతాయి.

వేసవిలో జాగ్రత్త అవసరం
అయితే ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం కంటే.. ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. అయితే వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ రసం కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వేడి నుండి ఉపశమనంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం సన్‌బర్న్‌ను నివారించడమే కాకుండా సన్‌బర్న్ చికిత్సలో కూడా సహాయపడుతుంది. అంతేకాదు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిది. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం లేదా ORS తరచుగా త్రాగాలి. దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు మరియు కూరగాయలను తినండి. ఆల్కహాల్, కెఫిన్ (కాఫీ, టీ), చక్కెర పానీయాలు నిర్జలీకరణానికి దారితీస్తాయి, కాబట్టి వాటిని తగ్గించాలి.
