వినోదం
ఓయ్-జక్కీ మహేష్
భారీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘హాయ్ నాన్న’ ఫేమ్ సౌర్యువ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మేకర్స్ హాలీవుడ్ టెక్నికల్ టీమ్‌ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన కథానాయికగా నటిస్తుందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతుందని సమాచారం.
కృతి సనన్.. టాలీవుడ్ ఐరన్ లెగ్?
కథానాయికగా కృతి సనన్ ఎంపికపై టాలీవుడ్ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఆమె గత తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడమే. మహేష్ బాబుతో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1: నేనొక్కడినే’ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన చేసిన ‘దోచేయ్’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ ఆమెను తీసుకోవడం పెద్ద రిస్క్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్
తెలుగులో సక్సెస్ లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి సనన్. తన గ్లామర్, నటనతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ మొదట్లో తెలుగులో కష్టపడినా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ కోణంలో చూస్తే మార్కెట్ పరంగా విజయ్-క్రితి జోడీ సినిమాకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ సరిహద్దులు దాటి సినిమాకు గుర్తింపు తీసుకురావడంలో ఆమె సహకరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ కెరీర్‌కు కీలక సమయం
వరుస ఫ్లాపుల తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన్’ వంటి భారీ చిత్రాలపై దృష్టి సారించాడు. సౌర్యువ్-క్రితి సనన్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ కెరీర్‌కు చాలా కీలకం కానుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మరి ఈ జోడీతో మహేష్, నాగ చైతన్య పొందని విజయాన్ని విజయ్ దేవరకొండ అందుకుంటాడో లేదో చూడాలి.
