విజయ్ కేబినెట్ ఇదే..! హోం మంత్రి ఎవరు? | vijay క్యాబినెట్ జాబితాను తలపతిని ముఖ్యమంత్రిగా పని చేయడానికి హోం మరియు ఆర్థిక శాఖలతో విజయ్

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారానికి మరికొన్ని గంటల సమయం మిగిలి ఉంది. రేపు ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. చర్చల్లో భాగంగా విజయ్ తనకు మద్దతిస్తున్న పార్టీల లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీలు మద్దతిస్తున్నాయని పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్‌ని తమిళనాడు సీఎంగా నియమిస్తూ లేఖ అందజేశారు. అలాగే ఈనెల 13లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు.

మరోవైపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే తరుణం కోసం దళపతి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ కేబినెట్ మంత్రులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. జాబితాలోని వివరాల ప్రకారం విజయ్ ముఖ్యమంత్రి, ప్రభుత్వ పరిపాలన, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా సెంగోట్టయన్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఎన్. ఆనంద్, విద్యుత్ శాఖ మంత్రిగా సీడీఆర్ నిర్మల్ కుమార్, స్పోర్ట్స్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా అధవ్ అర్జున ప్రమాణస్వీకారం చేయనున్నారు.

విజయ్ క్యాబినెట్ జాబితా దళపతిని ముఖ్యమంత్రిగా పని చేయడానికి హోమ్ మరియు ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలతో విజయ్

అలాగే ఆది ద్రావిడ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ మోహన్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముస్తఫా, రిజిస్ట్రేషన్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అరుణ్ రాజ్, విద్యాశాఖ మంత్రి వెంకట రామన్ పేర్లు ఖరారయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాదు విజయ్ కేబినెట్ లోకి ఇద్దరు మహిళలు కూడా వస్తారని తెలుస్తోంది. ఈ మేరకు విజయలక్ష్మి, కీర్తనలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కీలకమైన ఆర్థిక శాఖను కూడా విజయ్ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో రాజ్యాంగం ప్రకారం 35 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరికొంతమంది నేతలు విజయ్ కేబినెట్ లో చేరనున్నట్లు సమాచారం.

More posts