దిగుబడి రేట్లు భారతదేశంలో MCX వద్ద బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి: స్పాట్‌లో 24K, 22K మరియు 18K మరియు వెండి స్వల్పంగా పెరిగింది

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. స్పాట్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,50,920కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,340గా నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 0.10 శాతం పెరిగాయి. వెండి ధర కూడా స్వల్పంగా 0.21 శాతం పెరిగి రూ. 2,43,284 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 4,597.07 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మునుపటి సెషన్‌లో రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ 2 తర్వాత ఇది అత్యల్పం.. నేడు కాస్త కోలుకుంది. జూన్ డెలివరీకి US గోల్డ్ ఫ్యూచర్ $4,610.20 వద్ద స్థిరంగా ఉంది. రెండు రోజుల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.

భారతదేశంలో 24K 22K మరియు 18K వద్ద MCX వద్ద బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి మరియు వెండి స్వల్పంగా పెరిగింది

కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరల వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ. 1,51,070 కాగా, హైదరాబాద్ మరియు చెన్నై ₹1,50,920 వద్ద ఉన్నాయి. జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,490, 24 క్యారెట్లు రూ. 1,51,070 నమోదైంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,390, 24 క్యారెట్లు రూ. 1,50,970 నమోదయ్యాయి. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ. 1,38,340, 24 క్యారెట్లు రూ. 1,50,920.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు).

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,219, 22 క్యారెట్లు – రూ. 13,950, 18 క్యారెట్లు – రూ. 11,635

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు – రూ. 11,353

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు – రూ. 11,353

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు – రూ. 11,353

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు – రూ. 11,353

విశాఖపట్నం

24 క్యారెట్లు – రూ. 15,137, 22 క్యారెట్లు- రూ. 13,875, 18 క్యారెట్లు – రూ. 11,353

More posts