వినోదం
ఓయ్-కొరివి జయకుమార్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఓ వైపు ప్రజాసేవలో కొనసాగుతూనే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. గతేడాది హరిహర వీరమల్లు, ఓజి సినిమాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓజీ భారీ విజయం సాధించగా, మిగిలిన రెండు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. భారీ అంచనాల నడుమ వచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ కాంబో లెవల్లో హిట్ కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కనీసం వంద కోట్లు కూడా రాబట్టలేకపోయింది.
ఈ క్రమంలో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సినిమాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా స్టార్ట్ చేయాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రిప్ట్ పూర్తి చేయాల్సిందేనని సురేందర్ రెడ్డికి పవన్ ఆదేశాలు జారీ చేశారు.

అమరావతిలో కార్యాలయం..
పవన్ ఆదేశాలతో సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విజయవాడ/అమరావతిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నందున స్క్రిప్ట్ డిస్కషన్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు సులువుగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ కూడా చర్చనీయాంశంగా మారింది. కొత్త గడ్డంతో కనిపిస్తున్న పవన్ ఇది కొత్త సినిమా కోసమా? లేక ‘OG 2’ కోసమా? అనే చర్చలు మొదలయ్యాయి. సూరి-వక్కంతం సినిమా స్క్రిప్టు కాస్త ఆలస్యమైనా పవన్ వెంటనే ‘ఓజి 2’ టేకప్ చేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సురేందర్ రెడ్డి గతంలో ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. అతను స్టైలిష్ మేకింగ్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌కి పేరుగాంచాడు. ‘ఏజెంట్’ సినిమా నిరాశపరిచినా, పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో స్ట్రాంగ్ బ్యాక్‌బ్యాక్ చేస్తాడని భావిస్తున్నారు. మరి ఈ సినిమాలు పవర్ స్టార్ ని మళ్లీ పాతకాలపు అవతార్ లో చూపిస్తాయా అనేది ఇప్పుడు అందరి ఆసక్తి. మరి పవన్ అభిమానుల ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే!
