వినోదం
ఓయ్-కొరివి జయకుమార్
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు వారికి పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అభిమానులు ఉన్నారు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తొలిరోజు వంద కోట్ల కలెక్షన్లు వసూలు చేసే సత్తా తన సినిమాకి ఉందంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సాలార్, కల్కి సినిమాలతో మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు. దేశంలోనే కాకుండా యూఎస్, యూకే, జపాన్ ఇలా చాలా దేశాల్లో ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే “రాజాసాబ్” చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్పిరిట్’. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో పాన్ వరల్డ్ టార్గెట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించబడుతుంది.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా ఫౌజీ చేస్తూ బిజీగా ఉన్నాడు.
అయితే ఇంత బిజీ షెడ్యూల్స్‌లోనూ ఫిట్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ప్రభాస్. దాంతో ఆయన డైట్ సీక్రెట్ ఏంటనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో గతంలో ప్రభాస్ అమ్మమ్మ, దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ.. ప్రభాస్ కూడా కృష్ణంరాజులా తిండికి అలవాటు పడ్డాడని వ్యాఖ్యానించింది.
చుట్టుపక్కల వారిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని.. ముఖ్యంగా షూటింగ్ సెట్లో పది ఇరవై మందికి పైగా క్రూ సభ్యులతో ఆహారం పంచుకుంటానని చెప్పాడు. అందుకే ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కుకింగ్ టీమ్ ఏర్పాటు చేసి.. రోజుకు దాదాపు రూ.2 లక్షల విలువైన ఆహారాన్ని సిద్ధం చేసి సెట్ లో అందరికీ వడ్డిస్తున్నారు. ప్రభాస్ మెనూలో చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, పీతలు ప్రధానమైనవి అని ప్రభాస్ చెప్పాడు. కృష్ణంరాజ్తో పాటు ప్రభాస్‌కు చేపల పులుసు అంటే చాలా ఇష్టమని తేలింది.
ఇక ప్రభాస్ తన సినిమాలో పనిచేసే నటీనటులకు భోజనం పంపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అదేవిధంగా చాలా ఇంటర్వ్యూలలో పంపిన ఫుడ్ గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
