క్రీడలు
oi-ఉప్పల శివప్రసాద్
IPL 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుస పరాజయాలకు తెరపడింది. మూడు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. శనివారం చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో సంజూ శాంసన్.. బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్ (4/18) నాలుగు వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ట్రిస్టన్ స్టబ్స్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) ఒంటరి పోరాటం చేయగా.. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో జామీ ఓవర్టన్ (4/18) నాలుగు వికెట్లు తీశాడు. అన్షుల్ కాంబోజ్ (3/35) మూడు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఆయుష్ మాత్రే (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే వికెట్ పడగొట్టగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
అదే మ్యాచ్‌కు కీలక మలుపు.
213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. జేమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఓవర్‌టన్ తన వరుస ఓవర్లలో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సమీర్ రిజ్వీ (6), ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ (17), ఆకిబ్ నబీ (4), ట్రిస్టన్ స్టబ్స్‌లను క్రీజులో ఉంచారు. ముఖ్యంగా, స్టబ్స్‌తో కలిసి 45 పరుగుల భాగస్వామ్యాన్ని తెరవడానికి డేవిడ్ మిల్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ మ్యాచ్‌కు కీలక మలుపు.
ఓ వైపు వరుస వికెట్లు కోల్పోయినా.. మరోవైపు స్టబ్స్ ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ చేశాడు. అతడిని కూడా ఓవర్టన్ అవుట్ చేసి చెన్నై విజయాన్ని పూర్తి చేశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లు ఓడినా.. ఈ మ్యాచ్‌లో ఓవర్టన్ విజయం సాధించాడు.
