DC vs RCB: 3 బంతుల్లో మిల్లర్ అద్భుతం- RCBకి భారీ షాక్..! | డేవిడ్ మిల్లర్ సమయం! RCB నుండి DC యొక్క చివరి ఓవర్ హీరోయిక్స్ స్నాచ్ విజయం

క్రీడలు

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ipl 2026లో మరొక గొప్ప మ్యాచ్). ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్ చివరి ఓవర్‌లో అనూహ్య ఫలితంతో ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63) మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్, కుల్దీప్, ఎంగిడి తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. చివర్లో అద్భుతం చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ ఇచ్చిన 176 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక పరుగు చేసిన పాతుమ్ నిస్సాంకను భువనేశ్వర్ కుమార్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా… అదే ఊపులో కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2) కూడా ఔట్ కావడంతో డీసీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ నిలకడగా ఆడుతూ ఆర్సీబీపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ 57 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో డీసీ 87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

RCB నుండి డేవిడ్ మిల్లర్ టైమ్ DC యొక్క చివరి ఓవర్ హీరోయిక్స్ స్నాచ్ విజయం

ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ కాసేపు ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. కానీ 26 పరుగులు చేసిన తర్వాత అక్షర్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో స్టబ్స్ కు డేవిడ్ మిల్లర్ జతకలిశాడు. వీరిద్దరూ వరుసగా భారీ షాట్లు ఆడి ఆర్సీబీని విజయానికి దూరం చేశారు. అయితే చివర్లో ఆర్‌సీబీ చక్కటి బౌలింగ్‌ చేయడంతో 20వ ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంది. షెపర్డ్ వేసిన చివరి ఓవర్ మొదటి రెండు బంతుల్లో కేవలం రెండు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో 13 పరుగులు. కానీ డేవిడ్ మిల్లర్ వరుసగా సిక్స్, సిక్స్, ఫోర్ కొట్టడంతో ఢిల్లీ మ్యాచ్‌ను ఆర్‌సిబి చేతుల్లోంచి చేజార్చుకుంది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ మాత్రమే 3 వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యాకు మరో వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

More posts