భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పరస్పరం సంచలన హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్, అమెరికాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 15 భారతీయ నౌకలు కూడా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయాయి. దాంతో భారత్‌లో ఆందోళనకర పరిస్థితులు మొదలయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇల్లాహి భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధంలో భారత ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు తమకు అండగా నిలిచారని చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అదే సమయంలో చనిపోయారు. కాగా, ఖమేనీ మరణించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు.
“భారత ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు మాకు అండగా నిలిచారు. వారు మా అత్యున్నత నాయకుని మృతికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు మరియు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ రుణపడి ఉంటాము” అని అబ్దుల్ మజీద్ హకీమ్ ఎల్లాహి అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలాహి మాట్లాడుతూ.. మానవత్వం, న్యాయం కోసం పోరాడుతూనే తమ నాయకుడు మరణించారని అన్నారు. ఇది కేవలం సంతాప సభ కాదని అన్నారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికన్ దళాల సంయుక్త దాడిలో ఇరాన్ అత్యున్నత నాయకుడు 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ బలగాల చేతిలో హతమయ్యాడు. అతని కుమారుడు మోజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్‌కు అత్యున్నత నాయకుడిగా పనిచేస్తున్నాడు.
