ఆర్టీసీ బస్సు బంద్ – జేఏసీ కీలక పిలుపు..!! | ఈ నెల 20 నుంచి టీజీఎస్‌ఆర్‌టీసీ జేఏసీ సమ్మె నిర్ణయం, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

TGSRTCలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఈ రోజు ఈ సమ్మె విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో.. ఇవాళ సాయంత్రం లేబర్ కమిషనర్ తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమవుతున్నారు. సమ్మె, డిమాండ్లపై అధికారులతో చర్చిస్తామన్నారు. అధికారుల స్పందనను బట్టి సమ్మెపై ప్రకటన వెలువడనుంది.

తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు ఇవాళ లేబర్ కమిషనర్‌ను కలవడం రాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చినా.. ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా చర్చలకు పిలవకపోవడం పట్ల జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ కమిషనర్‌తో చర్చించిన తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని, ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

tgsrtc-jac సమ్మె-నిర్ణయం-ఈ నెల 20 నుండి-దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న-ఉద్యోగి-గ్రీవెన్స్-పరిష్కార-డిమాండ్

అధికారులతో చర్చలు.. సమ్మెపై నిర్ణయం

కాగా, కార్మికులంతా కార్మిక కార్యాలయానికి చేరుకోవాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కార్మికులు తమ డిమాండ్లను వినిపించాలని ఆదేశించారు. కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వేతనాలు, సర్వీసు సమస్యలు, బెనిఫిట్స్‌ వంటి సమస్యలపై ఆర్టీసీ కార్మికులు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో ఆందోళన పెరుగుతోంది. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సమ్మె తప్పదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి 13న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమ్మె చేయాల్సి వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని జేఏసీ నేతలు హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. దీంతో ఈ చర్చలు సఫలమవుతాయా.. లేక సమ్మెకు దారితీస్తాయా అన్నది నేడు తేలనుంది.