క్రీడలు
ఓయ్-చంద్రశేఖర్ రావు
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్థానిక జట్టు 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అర్ధ సెంచరీలతో విజృంభించారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరిశాడు.
ఆ తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ పోరాట పటిమను ప్రదర్శించినా విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్ హైలైట్‌గా నిలిచాడు. తడాఖా చూపించాడు. RCBకి చెమటలు పట్టించాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతను 31 బంతుల్లో 9 భారీ సిక్సర్లు, ఒక బౌండరీతో 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అతను స్నాయువు గాయంతో బాధపడుతున్నాడు. అతని ఫిట్‌నెస్‌పై ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. 241 పరుగుల లక్ష్యంతో రోహిత్ శర్మ మరియు ర్యాన్ రికిల్‌టన్ పవర్‌ప్లేలో 62/0తో ముంబైకి మంచి ప్రారంభాన్ని అందించారు, అయితే ఇబ్బంది వచ్చింది. రోహిత్ శర్మ (13 బంతుల్లో 19) ఆరో ఓవర్లో స్నాయువు సమస్యతో రిటైర్ అయ్యాడు. తిరిగి క్రీజులోకి రాలేదు.
మ్యాచ్ అనంతరం షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు స్నాయువు సమస్య ఉందని ధృవీకరించాడు. దీనిపై మరింత సమాచారం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. గాయం తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీని తీవ్రత తెలియాలంటే రోహిత్‌కు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఫిజియోథెరపిస్ట్ అతనికి మైదానంలో చికిత్స చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు.
రోహిత్ గాయంపై ముంబై ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే కనీసం ఒకట్రెండు మ్యాచ్ లకు దూరం అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌ను నాలుగు రోజుల్లో ఆడనుంది. 16న వాంఖడేలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పుడున్న పరిస్థితి తీవ్రతను చూస్తుంటే ఈలోగా రోహిత్ శర్మ కోలుకోకపోవచ్చని అంటున్నారు.
