వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
అంతర్జాతీయ చమురు మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఉంది. ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలం కావడంతో ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రెట్టింపు అవుతున్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు, ఇరాన్ నౌకాశ్రయాలను అడ్డుకోవాలన్న అమెరికా నిర్ణయం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ముడి చమురుపై ప్రభావం చూపుతున్నాయి. క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నాయి.
సోమవారం వీటి ధర ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. రెండు దేశాల మధ్య యుద్ధం ముదిరితే ధరలు మరింత పెరిగి ప్రపంచ ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 104.24 డాలర్లకు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏడు శాతంపైగా పెరిగి 102.29 డాలర్లకు చేరుకుంది. గ్యాస్ ధర కూడా రెండు శాతం పెరిగి 2.684 డాలర్లకు చేరుకుంది.

ఇరాన్ యుద్ధ సమయంలో హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. యుద్ధానికి ముందు ఫిబ్రవరి చివరలో బ్యారెల్‌కు సుమారు $70 వద్ద వర్తకం చేసిన ధర, యుద్ధం ప్రారంభమైన తర్వాత $119కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈరోజు వివిధ నగరాల్లో పెట్రోల్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 107.46
ఢిల్లీలో పెట్రోల్ ధర: రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
ఇవీ డీజిల్ ధరలు.
హైదరాబాద్‌లో డీజిల్ ధర: రూ. 95.70,
ఢిల్లీలో డీజిల్ ధర: రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: రూ. 92.52
