భారతదేశం
-కొరివి జయకుమార్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు సహా నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొత్త జీవితం ప్రారంభించిన ఆనందంలో ఉన్న కుటుంబాలు క్షణాల్లోనే విషాద సముద్రంలో మునిగిపోయాయి. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో రోడ్డు భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు ఏం జరిగింది..
వేగంగా వచ్చిన లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డైంది. ట్రక్కు అదుపు తప్పి నేరుగా ఆటోను ఢీకొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 25 ఏళ్ల వీరేంద్ర శక్య, అతని భార్య రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరోజు ముందుగా సమీపంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుక ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న వీరేంద్ర తల్లి అన్వేష్ షాక్యా (50), రాజో శాక్యా (22) కూడా ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు వీరేంద్ర సోదరి భూరియ శక్య(19) ఆటో డ్రైవర్ సమీపంలోని దుకాణానికి వెళ్లడంతో తృటిలో ప్రమాదం తప్పింది. లేకుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. లారీ ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లోపల ఉన్న వారిని బయటకు తీసుకురావడం చాలా కష్టమైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో శిథిలాలు గట్టిగా ఇరుక్కుపోవడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు జేసీబీ యంత్రాన్ని ఉపయోగించారు. సుమారు అరగంట పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటనతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. నవ దంపతులు మృతి చెందడం స్థానికులను కంటతడి పెట్టించింది. గ్రామం శోకసంద్రంలో మునిగిపోయి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
