వినోదం
ఓయ్-కొరివి జయకుమార్
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమిళంలోనే కాకుండా సౌత్ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టీవీకే అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న తరుణంలో ఆయన గత చిత్రం ‘జననాయగన్’ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది.

ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అలాగే చాలా పైరసీ వెబ్‌సైట్లలో ఫుల్ మూవీని అందుబాటులో ఉంచడం పెద్ద రచ్చగా మారింది. అయితే ఈ ఘటనపై కోలీవుడ్ ఇండస్ట్రీ మొదట్లో మౌనం వహించడం మరింత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ఘటనపై తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నమ్మకం, శ్రమ, కలల మేళవింపుతో రూపొందే సినిమా ‘జననాయగన్’ లీక్ నన్ను కలచివేసింది’ అని అన్నారు.
ఇలాంటి ఘటనలు యావత్ సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తాయని, సృజనాత్మకతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయంలో, ఈ నష్టాన్ని ఎదుర్కోవడంలో నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, పైరసీని అరికట్టాలని కోరారు. ‘పైరసీని చంపేద్దాం.. సినిమాను బతికిద్దాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో మెగాస్టార్ నిజంగానే మెగాస్టార్ అని ప్రశంసలు కురుస్తున్నాయి.
యొక్క దురదృష్టకర లీక్ #జననాయకన్ అనేది నాకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
నమ్మకం, కృషి, అనేకుల సామూహిక కలల ఆధారంగా సినిమా నిర్మించబడింది.ఇటువంటి సంఘటనలు పరిశ్రమలో మనందరినీ ప్రభావితం చేస్తాయి మరియు మన సృజనాత్మక పనిని రక్షించుకోవడం ఎంత కీలకమో మాకు గుర్తు చేస్తుంది.
మేము KVN తో ఒకటిగా నిలబడతాము…
— చిరంజీవి కొణిదెల (@KChiruTweets) ఏప్రిల్ 10, 2026
ఈ ఘటనపై తమిళ నటుడు శివకార్తికేయన్ కూడా స్పందిస్తూ సినిమా పైరసీని తీవ్రంగా ఖండించారు. “ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టపడతారు. దయచేసి థియేటర్లలో విడుదలయ్యే వరకు వేచి ఉండండి మరియు అక్కడ చూడండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, నటుడు విజయ్ ఆంటోనీ కూడా లీక్‌ను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. అయితే కోలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలు ఈ విషయంపై ఇంకా మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
