ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీలో పెద్ద సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఈ నెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కానుంది. మహిళా రిజర్వేషన్ ఆమోదం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందరూ సహకరించాలని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కోరారు. 2029 ఎన్నికల నుంచి మహిళలకు ఈ రిజర్వేషన్ అమలు కానుంది. అలాగే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు కూడా 50 శాతం పెరగనున్నాయి. పెరిగిన సీట్లలో 33 శాతం కేటాయిస్తారు. ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్యపై క్లారిటీ రావడంతో మహిళా రిజర్వేషన్ అమలు ద్వారా మహిళలకు వచ్చే సీట్ల సంఖ్యపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.
2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు. ఈ నెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం తీసుకువస్తున్న తాజా బిల్లుల ద్వారా లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లు 263కి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరగనున్నాయి.ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది.2011 జనాభా లెక్కల ప్రకారం ఈ స్థానాలను పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీలో మహిళలకు 13 లోక్ సభ, 87 అసెంబ్లీ స్థానాలు కేటాయించనున్నారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏపీలో మహిళలకు కేటాయించే సీట్లపై క్లారిటీ వచ్చింది. జనాభా లెక్కల ప్రకారం వీటిని ఖరారు చేశారు. అందులో అన్నింటికంటే ఎక్కువ మంది మహిళలతో భీమిలి అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా పాణ్యం, గాజువాక, చంద్రగిరి, తిరుపతి, మంగళగిరి, పెనమలూరు, రంపచోడవరం (ఎస్టీ) ఉన్నాయి.

మహిళా నియోజకవర్గాలు రాజకీయాల్లో కీలక మలుపు
వీటితో పాటు పెందుర్తి, గురజాల, విశాఖపట్నం నార్త్, కోవూరు, కర్నూలు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, గుంటూరు వెస్ట్, గన్నవరం, మైలవరం, నెల్లూరు రూరల్, తెనాలి, నంద్యాల, అనంతపురం అర్బన్, ఇచ్ఛాపురం, కడప, శ్రీకాకుళం, చింతలపూడి (ఎస్సీ) రాజమహేంద్రవరం రూరల్, గుంతకల్లు, కాకినాడ సిటీ, పలమనేరు, విశాఖపట్నం తూర్పు, మాచర్ల, వినుకొండ, కాకినాడ రూరల్, భీమవరం, రాయదుర్గం, మదనపల్లె, పోలవరం (ఎస్టీ), కావలి, జమ్మలమడుగు, కొత్తపేట, పాయకరావుపేట, శ్రీకాళూరు, విజయనగరం, శ్రీకాళూరు, విజయనగరం, శ్రీకాళోఠస్ కదిరి, రాప్తాడు, ఆలూరు, గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ, గూడూరు (ఎస్సీ), ఒంగోలు, బనగానపల్లె, తాడిపత్రి నియోజకవర్గాలను జనాభా లెక్కల ప్రకారం మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మార్పులు, చేర్పులకు అనుగుణంగా తుది జాబితాను ఖరారు చేయనున్నారు.
