క్రీడలు
-చంద్రశేఖర్ రావు
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారైంది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై 82 పరుగులతో అద్భుత విజయం సాధించి జట్టుకు కీలకమైన 16 పాయింట్లను సంపాదించిపెట్టింది. సాధారణంగా 12 మ్యాచ్‌ల నుండి 16 పాయింట్లు ప్లేఆఫ్స్ బెర్త్ సాధించడానికి మ్యాజిక్ నంబర్‌గా పరిగణించబడుతుంది. ఈ విజయంతో ఇతర జట్ల ప్లేఆఫ్ అవకాశాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
ఐపీఎల్ అధికారిక ప్రసారకర్తలు అందించిన సమాచారం ప్రకారం.. గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు 94.9 శాతానికి పెరిగాయి. దీనికి విరుద్ధంగా, సన్‌రైజర్స్ అవకాశాలు 80 శాతం నుండి 65.7 శాతానికి పడిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్ అవకాశాలు 80.1 శాతం నుండి 79.7 శాతానికి పడిపోయాయి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అవకాశాలు స్వల్పంగా 42.7 శాతం నుండి 42.8 శాతానికి పెరిగాయి. నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అవకాశాలు కూడా 62.5 శాతం నుంచి 62.7 శాతానికి పెరిగాయి.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అధిగమించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీలతో 168 పరుగులు చేసింది. బౌలింగ్‌లో SRH పేసర్లు ప్రఫుల్ హింగ్ (2/17), పాట్ కమిన్స్ (1/20) మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. భారీ తేడాతో ఓటమి పాలైంది. కగిసో రబాడ (3/28) జట్టు టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. జాసన్ హోల్డర్ (3/20) తనదైన శైలిలో రాణించాడు. ప్రసాద్ కృష్ణ (2/23), మహ్మద్ సిరాజ్ (1/11) వరుస వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. సన్‌రైజర్స్ పతనాన్ని శాసించింది.
రబడ సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. అతను ఉక్కిరిబిక్కిరి చేశాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ను ఛేదించేందుకు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ, రవిచంద్రన్ స్మరన్ లను పెవిలియన్ కు పంపాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిందంటే రబడా బౌలింగ్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు.
తర్వాత జాసన్ హోల్డర్ కూడా చెలరేగాడు. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వికెట్లు తీసి SRH ఆశలపై నీళ్లు చల్లారు. కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన 19 పరుగులే జట్టు టాప్ స్కోర్. వీరిలో ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. మాస్ పార్టిసిపేషన్ అస్సలు లేదు.
