క్రీడలు
oi-ఉప్పల శివప్రసాద్
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఆర్‌సీబీ చేతిలో ఎదురైన ఓటమికి గుజరాత్ టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది.
తొలుత బౌలింగ్‌లో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్.. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో విజయం సాధించింది. అర్షద్ ఖాన్(3/22), జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19)
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు ఘోరంగా విఫలమయ్యారు. మహ్మద్ సిరాజ్, కగిసో రబడా చెరో వికెట్ తీశారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), జోస్ బట్లర్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 నాటౌట్), రాహుల్ తెవాటియా (17 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) తమ సత్తా చాటారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (3/28) మూడు వికెట్లు తీశాడు. రొమారియో షెపర్డ్ (2/30) రెండు వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. సుయాష్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
అంపైర్ చేసిన పెద్ద తప్పిదం..
థర్డ్ అంపైర్ చేసిన తప్పిదం RCB విజయావకాశాలను ధ్వంసం చేసింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను అవుట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్ రజత్ పాటిదార్ నుండి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతిని నేలకు తాకాడు. అయితే థర్డ్ అంపైర్ దానిని ఔట్ చేశాడు. ఈ నిర్ణయంపై ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్‌తో పాటు ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. రజత్ పాటిదార్ కూడా అంపైర్లకు ధిక్కరిస్తూ మైదానం వీడాడు.
థర్డ్ అంపైర్ తప్పిదంతో మూడో వికెట్‌కు 44 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఆర్సీబీ వరుస వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. రజత్ పటీదార్ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే ఆర్సీబీ 180 ప్లస్ పరుగులు చేసి ఉండేది. అప్పుడే సులువుగా విజయం సాధిస్తారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అహ్మదాబాద్‌లో రజత్ పాటిదార్ యొక్క వివాదాస్పద క్యాచ్.
— తనూజ్ (@ImTanujSingh) ఏప్రిల్ 30, 2026
