మే 1 నుంచి సినిమా థియేటర్ల బంద్..!? | శాతం మరియు అద్దె వివాదంపై మే 1 నుండి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు మూసివేయబడతాయి

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

తెలంగాణ సినిమా థియేటర్ వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమైన తరుణంలో ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. మే 1 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరించారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి కీలక ప్రకటన చేసింది. మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తాజాగా నిర్ణయించింది.

తెలంగాణలో మే 1 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి కీలక ప్రకటన చేసింది. మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 450 సింగిల్ స్క్రీన్లు ఉండగా, హైదరాబాద్‌లో 150 కొనసాగుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నది వారి ప్రధాన డిమాండ్. అయితే దీన్ని నిర్మాతల సంఘం వ్యతిరేకించింది. థియేటర్లకు పర్సంటేజీ ఇవ్వలేమని స్పష్టం చేశారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్లు-తెలంగాణ-ఫేస్-షట్డౌన్-మే-1-ఓవర్-పర్సెంట్-వర్సెస్-రెంటల్-వివాదం

థియేటర్లు మూసివేయాలి..

పర్సంటేజీ విధానానికి అంగీకరించే డిస్ట్రిబ్యూటర్లతోనే ఎగ్జిబిటర్లు పని చేస్తారని తెలంగాణ కంట్రోలర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గట్టిగా చెబుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు ప్రస్తుత అద్దె విధానంతో ఇబ్బంది పడుతున్నాయని, వాటికి ఆదాయంలో న్యాయమైన వాటా అవసరమని స్పష్టమైంది. ప్రతిపాదిత నమూనా ప్రకారం, డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు మొదటి వారంలో 60 శాతం, రెండవ వారంలో 50 శాతం మరియు మూడవ వారంలో 40 శాతం ఆదాయాన్ని పొందుతారు, మిగిలిన మొత్తాన్ని ఎగ్జిబిటర్లు ఉంచుతారు.

భాగస్వాముల మధ్య చర్చల అనంతరం మోడల్‌ను ఖరారు చేసినట్లు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. సమ్మెకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

More posts