ఈ శతకం ఆయన వల్లే: వైభవ్ సూర్యవంశీ | IPL 2026: వైభవ్ సూర్యవంశీ SRHకి వ్యతిరేకంగా 36 బంతుల్లో సెంచరీ కొట్టినందుకు యశస్వి జైస్వాల్ యొక్క సలహాను క్రెడిట్ చేశాడు

క్రీడలు

oi-ఉప్పల శివప్రసాద్

యశస్వి జైస్వాల్ ఇచ్చిన సలహాతోనే తాను సెంచరీ చేయగలిగానని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌కు ఎలాంటి ప్రణాళిక లేదని, స్వేచ్ఛగా ఆడాలని యశస్వి జైస్వాల్ మ్యాచ్‌కు ముందు చెప్పాడని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్సర్లతో 103) చెలరేగిపోయాడు.

తొలి ఇన్నింగ్స్ తర్వాత సెంచరీ చేయడంపై వైభవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, తనదైన శైలిలో ఆడానని చెప్పాడు. మ్యాచ్ కు ముందు ప్రత్యర్థి జట్టు బౌలర్లను, బౌండరీల దూరాన్ని ఊహించుకుంటానని చెప్పాడు. ‘తొలి బంతికే సిక్సర్ కొట్టే ప్రణాళిక లేదు. మ్యాచ్‌కు ముందు యశస్వి జైస్వాల్‌తో మాట్లాడాను. మనం స్వేచ్ఛగా ఆడుకుందాం అని యశ్ భయ్యా నాతో చెప్పాడు. తొలి బంతి నుంచే సహజ సిద్ధతను విశ్వసించాలని చెప్పాడు.

IPL 2026 వైభవ్ సూర్యవంశీ SRHకి వ్యతిరేకంగా 36 బంతుల్లో సెంచరీ కొట్టినందుకు యశస్వి జైస్వాల్ యొక్క సలహాను క్రెడిట్ చేసారు

ఫోటో క్రెడిట్: jiohotstar కోసం స్క్రీన్ గ్రాబ్

ఈరోజు నేను యశ్ భయ్యా మాటలతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాను. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. బంతి కదలికకు అనుగుణంగా ఆడాను. వికెట్ బాగుంది. అందుకే నా ఆటపై నాకు నమ్మకం ఉంది. గత సీజన్‌లో ఇదే వేదికపై నేను ఆడిన తొలి మ్యాచ్ నాకు గుర్తుంది. నా నూటికి నూరుశాతం కృషిని జట్టుకు అందించి నా స్టైల్‌లో మెరవడమే నా లక్ష్యం.

ప్రత్యర్థి బౌలర్లు ఎవరు.. వారి బౌలింగ్‌లో ఎలాంటి షాట్లు ఆడాలి? మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల మధ్య బౌండరీల మధ్య దూరం ఎంత ఉంటుందో ఊహించుకుంటాను. ఈ వికెట్ చాలా బాగుంది. బ్యాట్‌పై బంతి బాగా వస్తోంది. కొత్త బంతితో పేసర్లకు కొంత సాయం అందుతోంది. మా స్కోరు బాగుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ ఈ స్కోరును కాపాడుకోవాలనుకుంటున్నాం. మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడమే మా లక్ష్యం’ అని యశస్వి జైస్వాల్ అన్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్సర్లతో 103) విధ్వంసకర సెంచరీ సాధించగా, ధృవ్ జురెల్ (35 బంతుల్లో 8 ఫోర్లు, 51) అర్ధ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగ (2/38) రెండు వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగే తలో వికెట్ తీశారు.

More posts