వినోదం
ఓయ్-కొరివి జయకుమార్
ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” టాక్ ఆఫ్ టౌన్ అయ్యాడు. హైదరాబాదులోని అత్యంత ప్రీమియం ఏరియా జూబ్లీహిల్స్‌లో ఆయన తన కొత్త కలల సౌధాన్ని నిర్మిస్తున్నారనేది ప్రస్తుతం సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణం దాదాపు రూ.80 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈ కొత్త ఇల్లు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చాలా దగ్గరలో ఉంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్ వ్యక్తిత్వం ప్రకారం, ఈ ఇంటి డిజైన్ స్టైలిష్‌గా మరియు మినిమలిస్టిక్ టచ్‌తో ఉంటుంది. సహజసిద్ధమైన వెలుతురును ఎక్కువగా ఉండేలా, పచ్చని ప్రదేశాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆర్కిటెక్చర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 4,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. మోడ్రన్ ఆర్కిటెక్చర్ తో పాటు అంతర్జాతీయ స్థాయి డిజైన్ ఎలిమెంట్స్ తో ఇల్లు రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇంటీరియర్ డిజైన్, ఇంపోర్టెడ్ మెటీరియల్స్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ వంటి కారణాలతో ఖర్చు పెరిగినట్లు తెలుస్తోంది.

అత్యాధునిక సౌకర్యాలు
ఈ భవనంలో లగ్జరీ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్, జిమ్, గార్డెన్ ఏరియా, హై-ఎండ్ సెక్యూరిటీ సిస్టమ్ వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన లివింగ్ స్పేస్ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరికల్లా గృహ ప్రవేశం పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అనుకున్న సమయానికి పనులు పూర్తయితే అల్లు అర్జున్ కుటుంబం త్వరలో ఈ కొత్త ఇంట్లోకి మారే అవకాశం ఉంది.
మరోవైపు అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాకా’. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్పరాజ్ సినిమాతో భారతీయ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఈ క్రమంలో బన్నీ యాక్టింగ్ ప్రాజెక్ట్స్ పై ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం.. సినిమా టైటిల్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా బజ్ పెంచేసింది. ఈ సినిమాకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేయగా, ఫస్ట్ లుక్ పోస్టర్ లో తల గుండు, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ లుక్ తో అల్లు అర్జున్ అందరికి షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా ‘ఇది ప్రారంభం మాత్రమే, సినిమా మీ ఊహకు అందని విధంగా ఉంటుంది’ అంటూ చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ హైప్‌ని మరింత పెంచింది.
ప్రత్యేక వార్తలు 🚨 #అల్లుఅర్జున్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ ఇంటి సమీపంలో విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నారు.
ఇది దాదాపు 4,000 చదరపు గజాలలో విస్తరించి ఉంది మరియు దీని ధర ₹80 కోట్లు. సంవత్సరం చివరి నాటికి గృహోపకరణాలు జరుగుతాయి. pic.twitter.com/HjeYU2SLId
— మిలాగ్రో మూవీస్ (@MilagroMovies) ఏప్రిల్ 22, 2026
