IPL 2026: అభిషేక్ శర్మ స్ట్రైక్స్! | IPL 2026: జేమీ ఓవర్‌టన్‌కి వ్యతిరేకంగా క్లియర్ అవుట్‌సైడ్ ఎడ్జ్ తర్వాత నడవడానికి నిరాకరించినందుకు అభిషేక్ శర్మ అభిమానుల కోపాన్ని ఎదుర్కొన్నాడు.

క్రీడలు

oi-ఉప్పల శివప్రసాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఐపిఎల్ 2026 సీజన్‌లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తొండాట ఆడినందుకు కొందరు అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పష్టంగా దొరికిపోయినా ఏం జరుగుతుందో తెలియనట్లు డ్రామా ఆడాడని వాపోయారు.

శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ (22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. అభిషేక్ శర్మ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

సంజు రివ్యూతో..

జామీ ఓవర్టన్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో దూకుడు అభిషేక్ శర్మను పెవిలియన్ చేర్చాడు. అయితే రివ్యూ ద్వారా CSKకి ఈ వికెట్ దక్కింది. ఓవర్టన్ వేసిన 8వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని థర్డ్ మ్యాన్ వైపు ఆడేందుకు అభిషేక్ శర్మ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకుని వికెట్ కీపర్ చేతిలో పడింది. క్యాచ్ పట్టిన సంజూ వికెట్ గా సంబరాలు చేసుకున్నా.. అంపైర్ మాత్రం బయటకు రాలేదు.

IPL 2026 అభిషేక్ శర్మ జేమీ ఓవర్‌టన్‌కి వ్యతిరేకంగా క్లియర్ అవుట్‌సైడ్ ఎడ్జ్ తర్వాత నడవడానికి నిరాకరించినందుకు అభిమానుల కోపాన్ని ఎదుర్కొన్నాడు.

ఆశ్చర్యకరంగా, బౌలర్ మినహా, ఇతర CSK ఆటగాళ్లు అప్పీల్ చేయలేదు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం సంజూ శాంసన్ రివ్యూ తీసుకోవాలని సూచించాడు. రివ్యూలో బంతి బ్యాట్ ఎడ్జ్ పట్టినట్లు స్పష్టమైంది. అయితే అభిషేక్ శర్మకు ఈ విషయం ముందే తెలుసని, తెలియనట్లు వ్యవహరించాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. అభిషేక్ శర్మ క్రీజు వదిలి వెళుతున్నప్పుడు బ్యాట్ శబ్దం వచ్చినట్లు సైగ చేశాడు.

ధోని కీపింగ్‌ శైలితో..

ఈ విషయంలో అభిషేక్ శర్మ తప్పేమీ లేదని మరికొందరు అంటున్నారు. కిక్కిరిసిన మైదానంలో అభిమానుల కోలాహలం మధ్య, బ్యాట్స్‌మెన్‌కు కొన్నిసార్లు బంతి ఎడ్జ్ అయిందని తెలియదు. ఏది ఏమైనా ఈ విషయం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ధోనీ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) తరహాలో సంజూ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడని సీఎస్‌కే అభిమానులు కొనియాడుతున్నారు. ఈ వికెట్ ఆట ఊపందుకుంది. అభిషేక్ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) అర్ధ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ (3/22), జామీ ఓవర్టన్ (3/37) మూడు వికెట్లు తీయగా, ముఖేష్ చౌదరి (2/21) రెండు వికెట్లు తీశారు. గుర్జప్‌నీత్ సింగ్ (1/34)కు ఒక వికెట్ దక్కింది.

More posts