భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే ప్రధాని మోదీ ఏ అంశంపై మాట్లాడుతారనే దానిపై స్పష్టత లేదు. కాగా, పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మహిళలకు అన్యాయం చేశాయన్నారు.
