అల్లు అర్జున్ “రాకా”లో షారూఖ్ ఖాన్? | అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ రాకా చిత్రం ఇందులో షారూక్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

వినోదం

ఓయ్-కొరివి జయకుమార్

ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత పార్ట్ 2.. విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద తన హవా చూపించాడు పుష్ప రాజ్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

ఈ క్రమంలో బన్నీ తదుపరి ప్రాజెక్ట్స్ పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాక సినిమా సంచలనం సృష్టిస్తోంది.

రీసెంట్ గా ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం.. సినిమా టైటిల్ తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా బజ్ పెంచేసింది. ఈ చిత్రానికి రాక అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గుండు, భారీ గోళ్లు, బీస్ట్ స్టైల్ లుక్ అందరినీ షాక్ కి గురి చేసింది. అంతే కాకుండా ‘ఇది ప్రారంభం మాత్రమే, సినిమా మీ ఊహకు అందని విధంగా ఉంటుంది’ అంటూ చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ హైప్‌ని మరింత పెంచింది.

అయితే రాకా కథ, అల్లు అర్జున్ పాత్ర గురించి సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్ర రెండు విభిన్న స్వభావాలతో ఉండబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పగలు మామూలు మనిషిగా ఉండే హీరో రాత్రికి రాత్రే భయంకర రాక్షసుడిగా మారుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ద్విపాత్రాభినయం మాత్రమే కాకుండా మానసిక పరివర్తన కథ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర పాజిటివ్ అయితే మరో పాత్ర నెగెటివ్ గా ఉంటుందని తెలుస్తుంది. అలాగే ట్రిపుల్ రోల్ కూడా ఉండొచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకుడు అట్లీ, షారుఖ్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్’ భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ అనుబంధం వల్లే షారుక్ గెస్ట్ అప్పియరెన్స్ ప్రమోషన్ లో ఊపందుకుంటోంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ వర్గాల్లోనూ ఇదే హాట్ టాపిక్ గా మారింది.

More posts