అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
దక్షిణ సూడాన్ రాజధాని జుబా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మృతుల్లో పైలట్‌తోపాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారు. యే నుంచి జుబా అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణం, దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు కెన్యా దేశస్థులు కాగా, మిగిలిన వారు సూడాన్‌కు చెందినవారు.
దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సిటీలింక్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా 208 కారవాన్ జుబా సిటీ శివారులో కూలిపోయింది. విమానం యే నుంచి జుబా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏప్రిల్ 27న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:15 గంటలకు బయలుదేరిన విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:43 గంటలకు రాడార్ కాంటాక్ట్ కోల్పోయింది.

ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగానే విమానం కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం తర్వాత విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై దక్షిణ సూడాన్ పౌర విమానయాన సంస్థ పూర్తి స్థాయి విచారణ జరుపుతోంది. మరణించిన వారిలో 12 మంది దక్షిణ సూడాన్‌కు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు కెన్యా దేశస్థులు. దక్షిణ సూడాన్‌లో ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
