ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
రైతులకు ఏపీ ప్రభుత్వం ఓ పెద్ద అప్‌డేట్. అధికారంలోకి వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం రైతుబంధు పథకాలకు పెద్దపీట వేస్తోంది. అన్నదాత సంక్షేమ నిధులను ఇప్పటి వరకు రెండు విడతలుగా చెల్లించారు. పీఎం కిసాన్‌తో పాటు ఈ నిధులు విడుదలయ్యాయి. కాగా, ఇప్పుడు రైతులకు ఇస్తున్న చెల్లింపులపై మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని విధంగా 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయని వెల్లడించారు.
రబీ ధాన్యం సేకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, సాగులో జాప్యం జరిగినా కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. అదే విధంగా రబీ సీజన్ ధాన్యాన్ని సేకరిస్తున్నామని, సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లు లేకుండా రైతుల నుంచి ధాన్యం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 24 గంటల్లో రూ.11,300 కోట్లను రైతులకు అందించామన్నారు.

రబీ ధాన్యం సేకరణ.. 24 గంటల్లో నిధులు జమ
అదేవిధంగా 8 గంటల్లోనే రూ.7,300 కోట్లు జమ అయ్యాయని చెప్పారు. అలాగే రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇది రికార్డు అని వివరించారు. 48 గంటల్లో 2.01 లక్షల మంది రైతులకు రూ.4,575 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులు తెలుసుకుని ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం కంటే పొత్తుల కాలంలోనే ధాన్యం సేకరణ ఎక్కువగా జరిగిందన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత నెలకో, రెండు నెలలకో నిధులు జమ చేసేవారన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి 2022-23లో 35.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ. 7,222 కోట్లు రైతులకు అందించారు. 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25లో 35.95 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-26లో 48.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు.
-

గంటన్నరలో అమరావతి టు హైదరాబాద్ కేంద్రం కీలక నిర్ణయం..!!
-

పాదయాత్ర ఇంకా ముందే మొదలైంది: ‘మావిగన్’ ఆషామాషీ అనలేదు- జగన్..!!
-

ముంచుకొస్తున్న తుపాన్ ముప్పు, భారీ వర్షాలు – ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
-

మావిగన్ పై రియాక్షన్ చూసి వణుకుతున్న చంద్రబాబు!
-

కొత్త ఇళ్లు, ప్లాట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అర్హుల జాబితా.. పంపిణీకి సమయం..!!
-

రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు – ఆధారాలతో సహా.. నెక్స్ట్..!!
-

అమరావతి ఇప్పుడు ప్రత్యేకం – తాజా నిర్ణయం, మలుపు..!!
-

నియామకాలు- పోస్టుల్లో కొత్త మార్పులు, ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం.. ఇక నుంచి..!!
-

అమరావతి: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది
-

ఏపీలో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్? చంద్రబాబు అమరావతిపై ధర్మాన ఫైర్..!
-

లాక్ డౌన్: ఈ రాత్రి నుంచి కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-

ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉన్న దేశాలు ఇవే.. లెక్కలు మారాయి..
-

ఒక్క పోస్ట్ తో అందరినీ ఉర్రూతలూగించిన “త్రిష”..
-

మే నెల జాతక ఫలితాలు సింహం, కన్యారాశి
-

తిరుపతికి కొత్త అమృత్ భారత్, వందే భారత్ స్లీపర్ – రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!
