వినోదం
ఓయ్-బొమ్మ శివకుమార్
ఈ రోజుల్లో చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు. కథలో గట్స్ ఉంటే ఈ మధ్య కాలంలో సినిమాలు హిట్ కావడం లేదు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను రీరిలీజ్ చేయడం అలవాటు చేసుకున్నారు. కొత్త సినిమాలపై శ్రద్ధ పెట్టడం మానేశారు. ఆ సినిమా హిట్ అయితే తప్ప చూడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది వరుసగా మూడు హిట్లు కొట్టి తన సత్తా చాటాడు. తన విలక్షణమైన నటనతో మామూలు సినిమాలకు కూడా ప్రాణం పోయడం ఆయన ప్రత్యేకత. గతేడాది కుబేర, ఇడ్లికొట్టు, తేరే ఇష్క్ మైన్ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించాడు. ఈ ఏడాది కారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా కారా సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
కారా సినిమా ప్రధానంగా రైతుల సమస్యలు, ముఖ్యంగా రుణాల మోసాలపై రూపొందించబడింది. కమర్షియల్ యాంగిల్‌లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం బాగానే రాబడుతున్నాయి. అయితే ధనుష్ గత చిత్రాలతో పోలిస్తే కాస్త డల్ గా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు పెరిగాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ధనుష్ కారా సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 6. 25 కోట్ల నికర వచ్చింది. అలాగే రెండో రోజు రూ. 6.95 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్‌గా కారా సినిమా ఇండియాలో రూ. 15.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసిందని స్పష్టం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే కారా సినిమా హిట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం కారా. ఈ సినిమాలో ధనుష్ సరసన మమితాబైజు హీరోయిన్ గా నటించింది.
