క్రీడలు
ఓయ్-చంద్రశేఖర్ రావు
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలకు చెక్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై చెపాక్ చిదంబరం స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. రుథరాజ్ గైక్వాడ్ అజేయ అర్ధ సెంచరీతో చెన్నై జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ప్రత్యర్థులపై సీజన్ డబుల్ పూర్తి చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్ 57 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ, మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. అంతకుముందు మ్యాచ్ లో సెంచరీ చేసిన ర్యాన్ రికెల్టన్ ఇక్కడ కూడా దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్- 21, కెప్టెన్ హార్దిక్ పాండ్యా- 18, తిలక్ వర్మ- 5 మళ్లీ విఫలమయ్యారు.

అనంతరం సీఎస్‌కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్- 67, కార్తీక్ శర్మ- 54 అజేయ అర్ధ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ సంజూ శాంసన్ 11 పరుగులు చేసినా మరో ఓపెనర్ ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన జట్టు రెండు విజయాలతో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించింది.
ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే, మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తే, గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకుంటుంది. 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం సాధ్యమైనప్పటికీ, ఇది పూర్తిగా ఇతర జట్ల అనుకూల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన ఐదింటిలో గెలుపొందడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే స్థితికి దిగజారింది.
లీగ్‌లో ప్రస్తుతం అత్యల్పంగా ఉన్న తమ నెట్ రన్ రేట్‌ను గణనీయంగా మెరుగుపరచుకోవడం ముంబై ఇండియన్స్‌కు అత్యవసరం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 12 పాయింట్లు సాధించాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఈ టాప్ జట్లలో కనీసం రెండు లేదా మూడు జట్లను కోల్పోవాలి. కాబట్టి 14 పాయింట్లు దాటిన జట్లు నాలుగు మించకూడదు.
ముంబై ఇండియన్స్‌కు మిగిలిన మ్యాచ్‌లు 4న లక్నో సూపర్‌జెయింట్స్‌తో, 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, 14న పంజాబ్ కింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో, చివరకు మే 24న రాజస్థాన్ రాయల్స్‌తో ఉంటాయి. తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోతే సాంకేతికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటారు. ముంబై టాప్-4లో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అంతేకాదు ఇతర జట్ల ఫలితాలు కూడా వారికి అనుకూలంగా ఉండాలి.
