‘మీ దేశంలో అత్యంత అందమైన మహిళను నాకు ఇవ్వండి’ ఆర్మీ చీఫ్ సంచలన డిమాండ్ | ఉగాండా ఆర్మీ చీఫ్ విచిత్రమైన అభ్యర్థనలో టర్కీ నుండి $1 బిలియన్ మరియు అత్యంత అందమైన మహిళను డిమాండ్ చేశారు

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

ఉగాండా అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ జనరల్ మహూజీ కైనెరుగబా తన వింత వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు టర్కీ దేశానికి రెండు డిమాండ్లు వచ్చాయి. సోమాలియాలోని ఇస్లామిక్ టెర్రరిస్టులను ఒక సంవత్సరం పాటు అణచివేసేందుకు సైన్యాన్ని పంపినందుకు వారు 1 బిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు. అలాగే రెండో డిమాండ్ కింద టర్కీలోని అత్యంత అందమైన మహిళను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమెను తన భార్యగా చేసుకునేందుకు సిద్ధమని చెప్పాడు.

అయితే ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ మహూజీ కైనెరుగబా ఇలా డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఇటలీకి 100 అంకోల్ ఆవులను ఇస్తానని.. అందుకు బదులుగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనిని పెళ్లి చేసుకోవాలని.. ఓ వింత కోరికను బయటపెట్టాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత.. టర్కీకి చెందిన అత్యంత అందమైన మహిళను తన భార్య కావాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ మహూజీ కైనెరుగబా టర్కీకి 30 రోజుల అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో దౌత్యపరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంపాలాలోని టర్కీ ఎంబసీని మూసివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మహూజీ కైనెరుగబా ఉగాండా అధ్యక్షుడు యొవేరీ ముసెవెనీ కుమారుడని.. ఉగాండా సైన్యం సోమాలియాలో అల్ షహబ్ ఉగ్రవాదులతో పోరాడుతూ అక్కడి ప్రజలకు భద్రత కల్పిస్తుండగా, టర్కీ మాత్రం అక్కడ వ్యాపారం చేస్తూ భారీగా లాభాలు గడిస్తున్నదని మహూజీ కీలక ఆరోపణలు చేశారు. 1 బిలియన్‌ సెక్యూరిటీ డివిడెండ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఉగాండా ఆర్మీ చీఫ్ విచిత్రమైన అభ్యర్థనలో టర్కీ నుండి 1 బిలియన్ మరియు అత్యంత అందమైన మహిళను డిమాండ్ చేశారు

డబ్బుతో పాటు టర్కీలో అత్యంత అందమైన మహిళ కావాలని మహూజీ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ డిమాండ్లను నెరవేర్చకుంటే టర్కిష్ ఎయిర్‌లైన్స్ తమ గగనతలంలో ప్రయాణించకుండా నిషేధిస్తామని వారు హెచ్చరించారు. అలాగే కెన్యా రాజధాని నైరోబీని తన సైన్యం రెండు రోజుల్లో ఆక్రమించగలదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా లక్ష ఉగాండా సైన్యాన్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా కీలక ప్రకటన చేశారు.

More posts