మార్నింగ్ వాకింగ్ Vs ఈవెనింగ్ వాక్ – ఏది మంచిది? | ఉదయపు నడక ఖాళీ కడుపుతో కొవ్వును కాల్చే సామర్థ్యాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది, సాయంత్రం నడక రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది

ఆరోగ్యం

-సాయి చైతన్య

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు అదుపులో ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొందరు ఉదయం వాకింగ్ చేస్తుంటే… మరికొందరు సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తున్నారు. చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా ఈవినింగ్ వాకింగ్ మంచిదా? వాకింగ్ చేయడం ఎప్పుడు మంచిది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండింటిలో ఏది మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌న్న‌ది విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఏ సమయంలో చేసినా ఆరోగ్య ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. చాలా మంది తమ దినచర్యను నడక ద్వారా ప్రారంభిస్తారు. నడక గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నడక బిపి, షుగర్ మరియు అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. మార్నింగ్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త ప్రసరణను పెంచడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె కండరాలకు బలాన్ని అందిస్తుంది. బరువు తగ్గాలంటే.. రోజంతా యాక్టివ్ గా ఉండాలనుకునే వారు మార్నింగ్ వాక్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా, మార్నింగ్ వాక్ సహజంగా విటమిన్ డి అందిస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉదయం-నడకలో-కొంచెం-మెరుగైన-కొవ్వు-దహనం-సాధ్యం-కారణంగా-ఖాళీ-కడుపు-సాయంత్రం-నడక-సహాయపడుతుంది-r

నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అలాగే ఈవెనింగ్ వాక్ చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు. సాయంత్రం నడక రోజంతా ఏర్పడిన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అదేవిధంగా హాయిగా నిద్రపోవాలనుకునే వారికి వైనింగ్ వాకింగ్ మంచిదని అంటున్నారు. కండరాల బలం మరియు పనితీరు సాయంత్రం నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందుకే ఈవెనింగ్ వాకింగ్ బాడీ ఫిట్ నెస్ కు మేలు చేస్తుంది. అదేవిధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుందని, షుగర్ లెవల్స్ పెరగదని సూచిస్తున్నారు. తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమై జీవక్రియలు సక్రమంగా జరుగుతాయని వివరించారు. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి మరియు సరైన జీవక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే.. ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా.. వారి శారీరక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవడం మంచిది.

More posts