బెంగళూరులో భారీ వర్షం కారణంగా ఏడుగురు మృతి చెందారు.

భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బౌరింగ్ ఆస్పత్రి కాంపౌండ్‌లోని పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో వీధి వ్యాపారులు, పాదచారులు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈరోజు సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కురుస్తుండటంతో చాలా మంది బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీ గోడ వెలుపల ఫుట్‌పాత్‌పై టార్పాలిన్‌ కింద తలదాచుకున్నారు. ఫుట్ పాత్ వ్యాపారులు ఎండ నుంచి కాపాడుకునేందుకు తయారు చేసిన టార్పాలిన్ అది. వర్షం తీవ్రరూపం దాల్చడంతో వ్యాపారులు, పాదచారులు కింద తలదాచుకున్నారు. ఈదురు గాలులు, కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా గోడ కూలి వారిపైకి వచ్చింది.

భారీ వర్షాల కారణంగా బెంగళూరులో బౌరింగ్ ఆసుపత్రి గోడ కూలిపోవడంతో పిల్లలతో సహా 7 మంది చనిపోయారు.

ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గోడ కూలిన వెంటనే చుట్టుపక్కల వారు సహాయక చర్యలు చేపట్టారు. రాళ్ల కింద చిక్కుకున్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర బృందాలు చేరుకునేలోపే శిథిలాల నుంచి కొంతమందిని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సందర్శించారు.

మంగళవారం సాయంత్రం బెంగళూరులో వాతావరణం అనూహ్యంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, బలమైన గాలులు, వడగళ్ల వానలు కూడా నమోదయ్యాయి. సర్జాపుర తదితర ప్రాంతాల్లో దాదాపు గంటపాటు నిరంతరాయంగా భారీ వర్షం కురిసింది. కుంబాలగూడెం, రామోహళ్లిలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎంజీ రోడ్డు, రెసిడెన్సీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి.

More posts