సినిమా
ఓయ్-గరికపాటి రాజేష్
భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2’ తొలి వారంలో కలెక్షన్ల సునామీ సృష్టించినా, ఆ తర్వాత ఆ ఊపును నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా రన్ ఎలా ఉండబోతుందో. ఎంత వసూళ్లు సాధిస్తుందన్నది ఇప్పుడు సినిమాకు పెద్ద సవాల్. ‘ధురంధర్ 2’ విడుదలై 25 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్షన్ల లెక్కలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తొలి భాగం క్రియేట్ చేసిన అసాధారణ రికార్డులతో పోలిస్తే.. రెండో భాగం అంచనాలను అందుకోలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి పార్ట్ లాగా లాంగ్ రన్ ఉంటే ఈ సినిమా ఇప్పటికే 2500 కోట్ల క్లబ్ లో చేరి ఉండేది. ప్రస్తుతం ఈ సినిమా 1800 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి కసరత్తు చేస్తోంది. భారతీయ సినిమాకు గర్వకారణంగా ‘బాహుబలి 2’ రికార్డులను అధిగమిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వారం రోజుల్లో స్లో సినిమా
ప్రపంచవ్యాప్తంగా 25వ రోజు ‘ధురంధర్ 2’ దాదాపు రూ.21 కోట్లు వసూలు చేసింది. ఇండియా నుండి 17.50 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ నుండి 3.50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఈ లెక్కలు చూస్తుంటే సినిమా వర్కింగ్ డేస్ స్లో అయిందని అర్థమవుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.1712 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ మార్కెట్ రూ.1297 కోట్లు, ఓవర్సీస్ లో రూ.415 కోట్లు వసూలు చేసింది.
వివాదాలు, గణాంకాల గోల్మాల్!
మరోవైపు ఈ సినిమా కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ.1758 కోట్ల మార్కును క్రాస్ చేసిందని కొందరు అభిమానులు చెబుతుండగా.. రూ.1625 కోట్లకే పరిమితమైందని మరికొందరు విమర్శకులు వాదిస్తున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రూ.1800 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే వారాంతంపైనే ఉంది. బాహుబలి 2 లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్‌తో సరిపెట్టుకోవడానికి ‘ధురంధర్ 2’ రాబోయే శని మరియు ఆదివారాల్లో ఆకట్టుకునే కలెక్షన్లను రాబట్టవలసి ఉంటుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, ఈ చిత్రం బాహుబలి రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీకెండ్ దాటితేనే ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎటువైపు నిలుస్తుందో తెలిసిపోతుంది.
