భారతదేశం
-కొరివి జయకుమార్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. 76 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్ ఉదయ్ భాను బిస్వాస్ తన కుమార్తె ప్రియాంక బిస్వాస్ మృతదేహాన్ని ఐదు నెలల పాటు ఇంట్లో దాచిపెట్టడం స్థానికంగా సంచలనంగా మారింది. తేలి మొహల్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రియాంక బిస్వాస్ మృతి తర్వాత మృతదేహాన్ని దహనం చేయకుండా గదిలోనే ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉదయ్ భాను మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్లు ఎక్కువగా వాడినట్లు అధికారులు గుర్తించారు. గది మొత్తం మసాలా దినుసులతో నిండిపోయి, కూతురు ఇంకా నిద్రపోతున్నట్లుగా కప్పి ఉంచి, ఘటన మరింత భయానకంగా మారింది. అక్కడ నుంచి పదుల సంఖ్యలో ఖాళీ పెర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రియాంక చదువులో ప్రతిభ కనబరుస్తుందని అంటున్నారు. డబుల్ ఎంఏ, ఎంటెక్ పూర్తి చేసి కంప్యూటర్ టీచర్ గా పని చేసింది. అయితే తల్లి చనిపోవడంతో గత 13 ఏళ్లుగా తీవ్ర మనోవేదనకు గురవుతోంది. డిసెంబరు 5న ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయిందని తండ్రి విచారణలో అంగీకరించాడు. అయితే కూతురిపై ఉన్న అపారమైన ప్రేమ, ఆమెను పోగొట్టుకున్న బాధతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇంతలో ప్రియాంక ఎంతసేపటికీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ప్రియాంక బంధువులు ఆమెపై ఆరా తీశారు. తొలుత ఉదయ్ భాను డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్నానని అబద్ధం చెప్పి బంధువుల ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 10న అసలు విషయాన్ని బయటపెట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్‌పై ప్రియాంక మృతదేహం పూర్తిగా ఎముకల గూడుగా మారడం చూసి షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనపై సివిల్ లైన్స్ సీఓ నవీనా శుక్లా స్పందిస్తూ.. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని తెలిపారు. ఈ కేసులో మరిన్ని అనుమానాస్పద అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంక అనారోగ్యం కారణంగా వైద్యం చేయించకుండా పూజారి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన లేమి, లేదా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న మానసిక బంధమే ఈ ఘటనకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన సమాజానికి తీవ్ర హెచ్చరికగా మారింది. మానసిక ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా మూఢనమ్మకాలపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. అలాగే ప్రేమ పేరుతో తీసుకునే కొన్ని నిర్ణ యాలు కుటుంబ స భ్యుల కు వ్య తిరేకంగా ఎంత వ ర కు వెళ్తాయో స్ప ష్టం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సహాయం, కౌన్సెలింగ్ తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
