భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ భయంకరమైన ఉగ్రదాడి జరిగి ఏడాది అవుతుంది. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంచలన ప్రకటన చేసింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్-అమెరికా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాక్ కు ఈ గౌరవం దక్కడానికి పహల్గామ్ ఉగ్రదాడి కారణమని స్పష్టం చేశారు.
పాకిస్తాన్ నుండి పెద్ద టెర్రర్ ఒప్పుకోలు: పాకిస్తాన్ యుఎన్ నియమించబడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా యొక్క టాప్ టెర్రర్ కమాండర్ అబూ మూసా కాశ్మీరీ ఈ రోజు పాకిస్తాన్ యొక్క యుఎస్-ఇరాన్ మధ్యవర్తిత్వ స్థితికి కారణం భారతదేశ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఇందులో 26 మంది అమాయక పౌరులు… pic.twitter.com/5O3s5DaxJY
— ఆదిత్య రాజ్ కౌల్ (@AdityaRajKaul) ఏప్రిల్ 11, 2026
గత ఏడాది భారత్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచంలో పాక్ ప్రాబల్యం పెరగడానికి కారణమని లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్టు కమాండర్ అబూ ముసా కశ్మీరీ అన్నారు. ఈరోజు ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిపే స్థాయికి పాకిస్థాన్ వెళ్లడానికి కారణం పహల్గామ్ ఉగ్రదాడి అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడితో ప్రపంచంలో పాకిస్థాన్ ప్రభావం బాగా పెరిగిందని అన్నారు.

ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్టు కమాండర్ అబూ మూసా కాశ్మీరీ భారత్‌ను మరోసారి రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది మే 7-10 మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. ఇందులో భాగంగా భారత సైన్యం వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఈ క్రమంలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసి ధ్వంసం చేసింది. వాటిలో ముజఫరాబాద్‌లోని సవాయి నాలా క్యాంప్, సిద్నా బిలాల్ క్యాంప్, కోట్లిలోని గుల్పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబార్లోని బర్నాలా క్యాంప్, సియాల్కోట్లోని సర్జల్ క్యాంప్, మెహ్మునా జోయా క్యాంప్, మురిద్ కేలోని మర్కజ్ తైబా క్యాంప్, బహవల్పూర్లోని మర్కజ్ సుభనాల్లా క్యాంప్ ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా కూల్చివేసింది.
