భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరో సంచలనం నమోదైంది. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై 10 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బెంగాల్లో బీజేపీ ఇప్పటికే 200కి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు 72 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అయితే 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మమతను ఓడించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె భవానీపూర్‌లో గెలిచి సీఎం పదవిని నిలబెట్టుకున్నారు. సువేందు అధికారి ఈసారి కూడా మమతను ఓడించారు.
బెంగాల్ ఫలితాలపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజా తీర్పు కాదనీ, దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ఇది ఓటమి కాదు.. దోపిడీ.. దోపిడీ.. దోపిడీ. కేంద్ర బలగాలను మోహరించి బీజేపీ ఈ విజయం సాధించిందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఓటమితో తాము అధైర్యపడవద్దని.. తృణమూల్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని.. తప్పకుండా మళ్లీ పుంజుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఆమె కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ ఫలితాలపై న్యాయ పోరాటం చేస్తానని కూడా చెప్పారు.

బెంగాల్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణల కారణంగానే బెంగాల్ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అంచనా. బెంగాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరగగా, బీజేపీ 203 స్థానాల్లో విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 79 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది.
