తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. రేవంత్ సర్కార్ ఇప్పటికే మహిళల కోసం ఎన్నో పథకాలు అందజేస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇటీవల మహిళా విద్య, ఉపాధి రంగాలపై దృష్టి సారించిందన్నారు. మహిళా సంఘ సభ్యుల విద్యార్హత వివరాలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సంఘంలో నిరక్షరాస్యులుగా మిగిలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఇటీవల బీఆర్కే భవన్లో సెర్ఫ్ డైరెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు.
మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త అందించారు. ప్రతి మహిళను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళలకు అక్షరాస్యతతోపాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మహిళా సభ్యుల విద్యార్హత వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,227 గ్రామ మహిళా సంఘాల భవనాలకు అనుమతులు మంజూరయ్యాయని, అందులో 5,239 గ్రామాల్లో శరవేగంగా మహిళా భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రస్తుతం 5 వేలకు పైగా వీఆర్ ఓ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది మరో ఐదు వేల భవనాలు నిర్మిస్తామన్నారు.

అలాగే అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా 6.5 లక్షల మంది మహిళలకు అక్షరాస్యత కల్పించామని వెల్లడించారు. త్వరలో మరో 6 లక్షల మందికి గ్రామస్థాయిలో విద్యనందిస్తామని మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రతి మహిళా సంఘం ఆర్థిక క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు కిశోర బాలికల కోసం స్నేహ వేసవి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
