తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలంగాణ మహిళల ఎస్‌హెచ్‌జి వడ్డీ-రహిత రుణ పరిమితిని ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు రెట్టింపు చేసింది.

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించే వడ్డీ లేని రుణ పరిమితిని రెట్టింపు చేసింది. అంటే రుణ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క వెల్లడించారు. వీటికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని తెలిపారు. రుణాలపై చెల్లించే వడ్డీకి ప్రభుత్వం ఏటా రూ. 2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 40 శాతం పంట కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అప్పగించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

తెలంగాణలోని కోట్లాది మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు అర్హులైన స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

తెలంగాణ మహిళల ఎస్‌హెచ్‌జి వడ్డీ రహిత రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల వరకు రెట్టింపు చేసింది

2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 26,621.47 కోట్ల విలువైన బ్యాంకు రుణాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి సీతక్క తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలు రూ. 25,228.89 కోట్ల విలువైన బ్యాంకు రుణాలు పొందారు. గత రెండేళ్లలో బ్యాంకు లింకేజీ రుణాల కింద ప్రభుత్వం తొలుత రూ. 40 వేల కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. బ్యాంకులు, మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో రూ. 60 వేల కోట్ల రుణాలను విజయవంతంగా పంపిణీ చేశామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

More posts