గ్యాస్ సంక్షోభంలో వారికి 5 కిలోల సిలిండర్లు, కిరోసిన్ పంపిణీ – కీలక ఆదేశాలు..!! | రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాపై జాయింట్ కలెక్టర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

గ్యాస్ సంక్షోభం సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. బుకింగ్ రూల్స్ లో చేసిన మార్పులతో గ్యాస్ బుక్ చేసుకొని ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. 5 కిలోల సిలిండర్లు.. కిరోసిన్ పంపిణీపై క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రంలో గ్యాస్‌ కొరతను తీర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గ్రామాల్లో సిలిండర్ల పంపిణీలో జాప్యంపై అధికారులను అప్రమత్తం చేస్తూ ఎల్‌పిజి ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. గ్యాస్ కొరతను తగ్గించేందుకు త్వరలో 5కిలోల సిలిండర్లను పంపిణీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కిరోసిన్ సరఫరా కూడా చేపడతామని వెల్లడించారు. సరఫరాలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన వారికి 5 కిలోల సిలిండర్లు వెంటనే అందేలా చూడాలని సూచించారు. అదే సమయంలో పాడేరు తదితర ప్రాంతాల్లో కిరోసిన్ ఆవశ్యకతను గుర్తించి వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో కిరోసిన్ అవసరమైన ప్రాంతాలకు తక్షణమే సరఫరా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాపై జాయింట్ కలెక్టర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

గ్యాస్ కొరత విషయంలో అధికారులకు కీలక సూచనలు

ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు ప్రధాన చమురు కంపెనీల ఏజెన్సీల్లో బుకింగ్ లాకింగ్ పీరియడ్ అమలవుతోంది. పెద్ద సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నాయి. హెచ్‌పీ, భారత్ గ్యాస్ సరఫరా వారం రోజుల్లో పూర్తికానుండగా, భారతీయ ఏజెన్సీలు వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇది మూడు వారాల వరకు పడుతుంది. ఏజెన్సీల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వినియోగదారులు నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గ్యాస్ సంక్షోభం సమయంలో 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్రం భారీ సడలింపు ఇచ్చింది. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఎవరైనా చిన్న సిలిండర్లు పొందేలా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో 5 కిలోల వంటగ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే, 5 కిలోల సిలిండర్లు.. కిరోసిన్ నిల్వలపై కూడా ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

More posts