కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీ పోలింగ్-ఓట్ల శాతం..1 | పుదుచ్చేరి, కేరళ మరియు అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో అధిక ఓటింగ్ శాతం-ఇక్కడ పోలింగ్ శాతం ఉన్నాయి

భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఈరోజు జరిగిన ఒకే దశలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో ఈ మూడు చోట్ల కూడా భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఈసీ ప్రకటించింది. పుదుచ్చేరిలో భారీ పోలింగ్ శాతం నమోదవగా, అస్కం, కేరళలో కూడా అనేక రికార్డులు నమోదయ్యాయి.

పుదుచ్చేరిలో అత్యధికంగా 86.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత అస్సాంలో 84.42 శాతం, కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. EC ప్రకారం, అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 84.42 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2021 ఎన్నికల్లో నమోదైన 82.04 శాతం పోలింగ్‌ను అధిగమించింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది.

పుదుచ్చేరి కేరళ మరియు అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో అధిక ఓటింగ్ శాతం-ఇక్కడ పోలింగ్ శాతం ఉన్నాయి

అలాగే కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 74.06 శాతం పోలింగ్‌ కంటే స్వల్పంగా ఎక్కువ. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. గడువు కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించారు. ఇక్కడ ప్రాథమిక అంచనాల ప్రకారం 86 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది.

More posts