వినోదం
ఓయ్-బొమ్మ శివకుమార్
ఈ రోజుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం.. ఇలాంటి మాటలు చాలా వింటూనే ఉంటారు. అయితే టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలోకి రావడం మాత్రమే కాదు.. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం కూడా సులువు అని నిరూపించాడు కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. నాలుగు సినిమాలే చేసాడు.. కానీ యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమా కలెక్షన్లు రాబడుతోంది అంటే అర్ధం చేసుకోవచ్చు.
మూడు బ్లాక్ బస్టర్స్ అయిన నాలుగు సినిమాలే చేసాడు.. అవి కూడా యాట్రిక్.. పెద్ద హీరోలకు సాధ్యం కాని ఫీట్ ని ప్రదీప్ రంగనాథన్ సాధించాడు.. వరుసగా మూడు రూ.100 కోట్ల సినిమాలు ఇచ్చి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించుకున్నాడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో ఈ ఘనత సాధించాడు. అయితే ప్రదీప్ రంగనాథన్ నాలుగో సినిమా LIK ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా రాణిస్తోందని సమాచారం.
మొదటి రోజు మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు LIK సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు. రెండో రోజు రూ. 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. అయితే వారాంతం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ సోమవారం నుంచి క్రమంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

LIK సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి ప్రధాన కారణం ఈ సినిమా ఒకదాని తర్వాత మరొకటి వాయిదా పడడమే. దాదాపు రెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రదీప్ రంగనాథన్ బ్రాండ్ ఇమేజ్ కారణంగానే LIK సినిమాకు భారీ ఓపెనింగ్ వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ తమిళనాడులో మాత్రం కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో హిట్ టాక్ తెచ్చుకుంటుందా.. లేక ఫ్లాఫ్ టాక్ తో ముగుస్తుందో వేచి చూడాలి.
