అంతర్జాతీయ
ఓయ్-బొమ్మ శివకుమార్
పాకిస్థాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. దయనీయ స్థితిలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు మరో పిడుగు పడింది. వారి నుంచి తీసుకున్న 3 బిలియన్ డాలర్లు దాదాపు రూ. 2.79 లక్షల కోట్లు చెల్లించాలని యూఏఈ డిమాండ్ చేసింది. రుణం చెల్లించేందుకు గడువు పొడిగింపునకు అంగీకరించేందుకు యూఏఈ నిరాకరించింది. పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. ఒక్కసారిగా ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చాలా అధ్వాన్నంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి అనేక ఇబ్బందులకు గురి చేసింది.
అదే సమయంలో తమ నుంచి తీసుకున్న 3 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని యూఏఈ వార్నింగ్ ఇవ్వడంతో పాకిస్థాన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో డబ్బు కోసం పాకిస్థాన్ ఆయా దేశాలు, అంతర్జాతీయ సంస్థల వైపు చూస్తున్నట్లు సమాచారం. IMF నుండి సుమారు 1.3 బిలియన్ డాలర్ల కోసం పాకిస్తాన్ వేచి ఉంది. ఈ నిధులు ఐఎంఎఫ్ ఇస్తే పాకిస్థాన్ కు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.

అలాగే, చరిత్రలో తొలిసారిగా చైనా కరెన్సీలో రుణం తీసుకోవాలని పాకిస్థాన్ చూస్తోందని స్పష్టమవుతోంది. ఇందుకోసం పాండా బాండ్లను జారీ చేసేందుకు పాకిస్థాన్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లకు దూరంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు మళ్లీ ఆ దారిలో వెళ్లేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు యూరో బాండ్లు, ఇస్లామిక్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ త్వరలో యూఏఈకి నిధులు ఇవ్వకపోతే పాకిస్థాన్ దివాళా తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
